Tuesday , December 19 2017
Home / DSC-2014 / డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల చేసిన మంత్రి గంటా

డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల చేసిన మంత్రి గంటా

Click on below link to read this news in Andhra Jyothy

Click Here

విశాఖపట్టణం : డీఎస్సీ షెడ్యూల్‌ను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రేపు ఆన్‌లైన్‌లో డీఎస్సీ అభ్యర్థుల మెరిట్‌లిస్ట్‌ ఉంటుందన్నారు. అలాగే ఫిబ్రవరి 5న సెలక్షన్‌ జాబితా సిద్ధం చేస్తారని, ఫిబ్రవరి 8న డీఎస్సీ ద్వారా సెలక్షన్‌ లిస్టు ఖరారవుతుందన్నారు. ఫిబ్రవరి 17న అనర్హత అభ్యర్థుల జాబితా సీజీజీకి అందజేస్తారని, 22న ఎంపికైన అభ్యర్థుల జాబితాను మళ్లీ సిద్ధం చేస్తారని, 24న డీఈవోలు ఖాళీల జాబితా అందజేస్తారని మంత్రి తెలిపారు. అలాగే 25న అర్హులైన అభ్యర్థుల ద్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతుందని, ఫిబ్రవరి 29న తుది జాబితా, మార్చి 1న వెబ్‌ కౌన్సెలింగ్‌, మార్చి 5న పోస్టింగ్‌లు ఉంటాయన్నారు.

Check Also

APTET 2017 Tentative Schedule

APTET 2017 Tentative Schedule

 టెట్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన విద్యా శాఖా మంత్రి టెట్‌ షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ...